దీపావళి పండుగ గురించి తెలుసుకుందాం. వచ్చేయండి సంబరాలు చేద్దాం

పండుగ అంటే ఊరంతా కలిసి ఒక ఉత్సవంగా చేసుకునేది.. సంబరాలు అంబరాన్ని అంటాలి .. వచ్చేసింది దీపావళి ఎంత గానో.. ఎన్ని రోజులనుండి ఎదురు చూస్తున్న పండుగ.. చిన్న పిల్లలు పటాకుల కోసం, పెద్దవాళ్ళు ఉద్యోగంలో, వ్యాపారంలో లాభాల కోసం, వయసు వాళ్ళు దీపాల వెలుగులో అందాలూ చూడడానికి.. ఎంతగా ఎదురు చూస్తున్నారో. దీపావళి పర్వదినం సందర్భంగా జ్యోతిష్కులు పండగ విశేషాలను వివరించారు. రాశి ప్రకారంగా చూసుకోవచ్చు మనకు ఏం కలిసి వస్తుంది.. దేంట్లో చూసి అడుగు వేయాలో అని.

అస్సలు పండుగ అనగానే ఉదయాన్నే లేవడం తలస్నానం చేయడం మొదలు కొని, హంగామా హంగామాగా మొదలు పెట్టి, కొత్త బట్టలు కట్టుకోవడం కాని పక్షంలో శుభ్రంగా ఉతికిన వస్త్రాలు ధరించడం పండుగ రోజు చాలా మంచిది. ఒక గమనిక మద్యమాంసాలను తీసుకోవడం పగలు పూట నిద్రపోవడం మంచిది కాదు.. ప్రియమైన మందుబాబులు ఈ ఒక్కరోజు తాగడం పక్కన పెట్టేస్తే.. మన రాష్ట టాక్స్ తక్కువ అయిపోయి పేదరిక రాష్టంగా మరిపోము లెండి.. మన కుటుంబం కోసం ఒక్కరోజు కొద్దిగా దూరం పెట్టేయండి. ఈ రోజు ఇంటిలో ఏర్పాట్లు గుమ్మాలకు తోరణాలు ధరింపజేయడం ఇంటిలో దేవుడి పటానికి బొట్టు పూలతో అలంకరించి పూజించడము, ఇల్లు శుభ్రం చేయడం లాంటి పనులలో వీలుంటే కొద్దిగా సహాయపడండి..

ఇప్పుడు తెలుసుకుందాం.. అస్సలు దీపావళి పండుగ రోజు గురించి, లక్ష్మి దేవి పుట్టినరోజు, విష్ణువు లక్ష్మీదేవిని కాపాడిన రోజు, కృష్ణుడు నరకాసురుడుని చంపిన రోజు చాలా ప్రత్యేకతలు ఉన్న రోజు ఈ దీపావళి. దీపావళి అంటే దీపాల వరుస అని అర్ధం. దీపం దీప్తినిస్తుంది. చైతన్యాన్ని ప్రతిఫలిస్తుంది సంతోష చిహ్నంగా చీకటిని పారదోలుతూ దీపాలను వెలిగించి సంతోషాలతో జరుపుకొనే పండుగ ఈ దీపావళి పండుగ. చూసారా ఎంత సాంప్రదాయంగా ఉందొ !!

దీపావళి అంటే ఒక సరదా.. మన చిన్నతనం గుర్తుకు వచ్చే ఎన్నో గుర్తులు.. పెద్దలకు లాభాలు తెచ్చే పండుగ అని, కనీసం నెల రోజుల ముందు నుండే పండుగ కోసం ఎదురు చూస్తాం… పటాకులు, చిచ్చుబుట్లు , టపాకాయలు, ఉల్లికడ్డ, లక్ష్మి , డబల్ ఇలా బాంబ్ లా పేర్లు మారుతూ వాడి చప్పుడును పెంచుతూ చేసే అల్లరి అంత ఇంత కాదండి..ఎన్నో గుర్తులు

అస్సలు పండుగ వేడుక గురించి, పూర్వం భూదేవి పుత్రుడైన నరకాసురుడనే ఒక విలన్ గర్వాంధకారాలతో దైవ మానవ గణాలనీ అందరినీ హింసిస్తూ ఉండేవాడు. కొందరిని చంపడం కూడా జరిగింది. ఎవరి వద్దా తనకు అపజయం లేదనీ, ఒక్క తన తల్లి చేతుల్లోనే తనకు మరణం ఉండగలదనే వరం పొంది, అహంకారం తో స్త్రీలనందరినీ అవమాన పరుస్తూ, అపహరించడం మొదలుపెట్టాడు. రాక్షసుడు అన్నాక ఈ మాత్రం ఉండాలి కదా !! బాధితులు శ్రీ మహావిష్ణువు తో మొరపెట్టుకోగా శ్రీ కృష్ణుని అవతారం లో భూదేవి అంశ కలిగిన సత్యభామతో నరకాసురుని అంతమొందించాడు. కథ ముగిసింది కష్టం తీరింది. నరకాసురుడు తన మరణాన్ని ప్రజలంతా వేడుకగా జరుపుకోవాలని కోరడంతో ప్రజలు ఆనందంతో దీపాలు వెలిగించి, బాణసంచా కాల్చుకుని, దీపావళి పండుగ పేరుతో సంతోషం గా జరుపుకునే ఆచారం వచ్చిందని చెప్తారు. ఆ రోజు మొదలు అయిన ఈ పండుగ ప్రతి ఏడాది వైభవాన్ని పెంచుకుంటూ సంతోషంగా జరుపుకుంటున్నాం..

మనసు తెల్సిన పండుగ.. లేవగానే మొబైల్ తీసుకొని.. గూగుల్ లో ” దీపావళి Images, Deepavali Quotes ” మంచివి ఏరి కోరి.. ఆయుదాలు సిద్దం చేసుకొని.. Whatsapp లో దూకేసి వరుస పెట్టి అందరిని forward మెసేజ్ షేర్ చేసి ఆనందించడమే… కనీసం సాయత్రం అయిన బయటకు వెళ్లి కాసేపు సరదాగా స్నేహితులతో గడిపి వచ్చేయండి.. ఇక పటాకుల గురించి మాట్లాడుకుందాం.. ఒకరేమో కుమ్మేద్దాం అని అంటే, ఇంకొకరు పొల్యూషన్ అని.. Say no to crackers, Pollution Free Diwali అని అంటున్నారు.. అది నిజమే ఈ రోజు సరదా మనకు మన ప్రాణాలకు ముప్పు కాకుండా చూసుకోవాలి కదా.. అలా అని పటాకులు లేని పండుగ దీపావళి ఎలా అవుతది చెప్పండి.. పటాకులు పెట్టాల్సిందే .. లొల్లి లొల్లి చేయాల్సిందే. కానీ కొద్దిగా తగ్గిద్దాం.. అదుపులో కలుద్దాం.

అందరికి దీపావళి పండుగ శుభాకాంక్షలు .. మీ న్యూస్ మహల్

పండుగ అంటే ఊరంతా కలిసి ఒక ఉత్సవంగా చేసుకునేది.. సంబరాలు అంబరాన్ని అంటాలి
సాంప్రదాయం మనకు చేస్తున్న ఒక చిలిపి సత్కారం..ఈ దీపావళి నిరాశా నిస్పృహలు, వ్యాకుల పడటం, నిరుత్సాహ పడటం ఎలాంటి చెడు చేసే ఏవి అయిన మీ నుండి దూరం పోవాలని, మీ జీవితంలో జయాలు, నవ్వులు ఎల్లవేళల ఉండాలని చేసుకొని పండుగ ఈ దీపావళి

About the author

admin

Leave a Comment

View My Stats